![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -425 లో... దీప తండ్రి కుబేర్ కాదన్న విషయం అనసూయ చెప్పగానే అందరు షాక్ అవుతారు. నా తమ్ముడికి దీప ఒక బస్టాండ్ లో దొరికిందని అనసూయ చెప్పగానే బస్టాండ్ లో వదిలేసిన పాప బతికే ఉందని దాస్ పారిజాతంతో అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. అనసూయకి దీప గురించి ఎంత వరకు తెలుసో కనుకోవాలని జ్యోత్స్న అనుకొని మరి దీప తల్లిదండ్రులు ఎవరని అడుగుతుంది.
నాకు తెలియదని అనసూయ చెప్తుంది. అయితే దీప అనాధ అన్నమాట అనీ శ్రీధర్ అంటుంటే.. ఇంకొక సారి అలా అనకండి ఒక భర్తగా అన్ని నేనే అనీ కార్తీక్ అంటాడు. దీప నువ్వు నన్ను నాన్న అని పిలిచావ్ కదా.. ఇక నుండి అలాగే పిలువు అని దశరథ్ అంటాడు. అలా పిల్వడానికి రక్తబంధం ఉండాలని సుమిత్ర కోపంగా అంటుంది. పదండీ వెళదామని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత పారిజాతం ఇంటికి వచ్చి అనసూయ మాటలకి బుర్రబద్ధలు కొట్టుకుంటుంది. అది ఏ బస్టాండ్ లో దొరికిందోనని ఆలోచిస్తుంటే.. గ్రానీకి దీపే అసలైన వారసురాలు అని తెలియొద్దని డైవర్ట్ చేస్తుంది. ఇంత మందిలో ఎవరో ఒక అనాధ.. ఆ కుబేర్ కి దొరికి ఉంటుంది. నువ్వు టెన్షన్ తీసుకోకని జ్యోత్స్న అంటుంది.
మరొకవైపు అందరు జరిగిందానికి బాధపడుతారు. దీప ఎవరు అయితే ఏంటి.. ఇప్పుడు నా కోడలు అని కాంచన అంటుంది. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇచ్చి నీకు పర్వాలేదు కానీ దీప అనాధ అన్న విషయం దాచి కార్తీక్ ని పెళ్లి చేసుకుందని కోప్పడతాడు. దీపని ఎవరు పడేసి ఉంటారో ఒకవేళ తన తల్లి తప్పు చేసి వదిలించుకుందేమోనని శ్రీధర్, దీప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. కార్తీక్ పట్టరాని కోపంతో శ్రీధర్ మీదకి కొట్టడానికి వెళ్తాడు. నువ్వు చేసిందేంటి.. అమ్మ స్వప్నని కూతురు అనుకుంటుంది. లేకపోతే అక్రమసంతానం అంటారు కదా.. దీప ఎవరు లేక అనాధేమో.. స్వప్న నేను, నువ్వు ఉండి ఆనాధ కదా అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |